Dussehra 2025: దసరా లేదా విజయదశమి పండుగ.. తెలుగు ప్రజల జీవితంలో ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది. ఈ పండుగ సమయంలో తెలంగాణలో బతుకమ్మగా, ఆంధ్రప్రదేశ్‌లో దేవీ నవరాత్రులుగా వేడుకలు జరుపుకున్నప్పటికీ.. దసరా రోజున చేసే ముఖ్యమైన ఆచారలలో ‘పాలపిట్ట’ను చూడటం, జిమ్మి చెట్టు దర్శనం ముఖ్యమైనవి. ఇకపోతే ఈ పాలపిట్ట దర్శనాన్ని ప్రజలు అత్యంత శుభప్రదంగా, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఈ నమ్మకానికే గౌరవం ఇస్తూ ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా పెట్టుకున్నారు.…