Off The Record: కరవమంటే కప్పకి విడవమంటే పాముకి అన్నట్టుగా ఉందట ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను హ్యాండిల్ చేసే విషయంలో పార్టీ పెద్దలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అదే పార్టీ నాయకులు. ఏరి కోరి అవకాశాలు ఇచ్చిన నాయకులు పార్టీని వదిలిపోతుంటే.. కష్టపడి పని చేసినా గుర్తింపు ఇవ్వలేదని మరో నేత పక్కకి జరిగారు. ఏలూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన…