పాకిస్థాన్ ప్రస్తుతం దైనీయ స్థితికి చేరుకుంది. ఈ పరిస్థితిని వివరిస్తూ.. ఆ దేశ చట్టసభ చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ మాట్లాడుతూ.. భారత్ చంద్రుడిపై కాలుమోపుతుంటే.. పాక్ (Pakistan) మాత్రం ఇంకా మురుగు కాలువల్లో పిల్లల మరణాలనూ నివారించలేకపోతోందంటూ పేర్కొన్నారు.