పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఓ ఎమోషనల్ వీడియోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అక్తర్ ఇటీవలే మోకాళ్ల సర్జరీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్‌లోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న అక్తర్ ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన వీడియోతో తన బాధను పంచుకున్నాడు.