మార్చి 18 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. టీమిండియాకు ఈరోజు చాలా చిరస్మరణీయమైనది. మార్చి 18.. ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు తమ చివరి వన్డే మ్యాచ్ ఆడారు. వారిలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుమార్ సంగక్కర, మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఉన్నారు.