Pakistan: పాకిస్తాన్ తన చరిత్రను తప్పుగా చెప్పుకోవడం అలవాటు. ముఖ్యంగా, భారత్ విషయంలో ఏం జరిగినా, ఎన్ని యుద్ధాల్లో ఓడిపోయినా, చివరకు తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)ని కోల్పోయినా కూడా తమదే పై చేయి అని అక్కడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరకు విద్యార్థులకు నిజాలు తెలియకుండా, తప్పుడు అంశాలను స్కూల్ పాఠ్యాంశాలుగా చేర్చుతోంది. తాజాగా, మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి కూడా అక్కడి టెక్ట్స్ బుక్స్‌లో తప్పుడు పాఠ్యాంశాన్ని చేర్చింది.…