ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్- ‘ఎ’ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’తో తలపడింది. ఒమన్‌లోని అల్ అమరత్ నగరంలో అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందు టాస్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.