Pakistan: గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు రాజకీయ సంక్షోభం కూడా ఆ దేశాన్ని కుదిపేస్తోంది. చివరకు పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే.. చివరకు పాస్‌పోర్టులు కూడా ప్రింట్ చేసుకోలేని దుస్థితికి చేరుకుంది. దీంతో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.