Pakistan: జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి.? ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారు? అనే ప్రశ్నలకు సరైన సమాధానం లేదు. ప్రస్తుతం మాజీ ప్రధాని స్థితి, పరిస్థితిని తెలుసుకునేందుకు పాకిస్థాన్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వం మాత్రం ఆయన క్షేమంగానే ఉన్నారని చెప్పినా నమ్మసక్యంగా అనిపించడం లేదు. షాబాజ్ ప్రభుత్వం, వల్పిండిలోని అడియాలా జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని పదే పదే చెబుతున్నప్పటికీ కుటుంబీకులు, పార్టీ…
Pakistan: పాకిస్థాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం అక్కడి పౌరులలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. టమోటా ధర కిలోగ్రాముకు రూ.600కి చేరింది. ఇది దాదాపు 400% పెరుగుదలను సూచిస్తుంది. ఈ పరిస్థితులు ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. తాజాగా ఈ సమస్య పార్లమెంటులో గందరగోళ పరిస్థితులకు దారితీసింది. టమాటాలు కొనడానికి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంపీలు వ్యంగ్యంగా స్పందించారు.
Pakistan – Afghanistan: పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఆఫ్ఘన్ ప్రకంపనలు భీభత్సం సృష్టించాయి. తాజాగా అక్టోబర్ 9 రాత్రి సమయంలో ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ పెద్ద పేలుళ్లతో అతలాకుతలం అయ్యింది. దీంతో పాక్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలు మరోసారి విషమంగా మారాయి. పలు నివేదిక ప్రకారం.. పాక్ వైమానిక దళం (PAF) జరిపిన దాడి కారణంగా కాబుల్‌లో పేలుళ్లు సంభవించాయని తెలుస్తోంది. READ ALSO: Taliban: భారత పర్యటనలో మహిళల్ని దూరం పెడుతున్న తాలిబాన్ ప్రతినిధులు.. పాక్ రక్షణ…
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ జాతీయ భద్రతపై పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం రేపు (మంగళవారం) జరుగనుంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలో ఇటీవల ఉగ్రవాద దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
పాకిస్థాన్‌లోని వివిధ హైకోర్టుల ఆదేశాల మేరకు పీటీఐ చట్టసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన 37 పార్లమెంట్ స్థానాలకు ఆదివారం పాకిస్థాన్ అత్యున్నత ఎన్నికల సంఘం ఎన్నికలను నిలిపివేసింది.