Pakistan: పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా 2019లో భారత్ చేపట్టిన ‘‘బాలాకోట్ ఎయిర్ స్టైక్స్’’ సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అభినందన్ వర్థమాన్ అనుకోకుండా పాక్ ఆర్మీకి చిక్కారు. ఆ సమయంలో, ఆయనను పట్టుకున్న పాక్ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా ఇటీవల తాలిబాన్ దాడుల్లో హతమయ్యాడు. ఆయన అంత్యక్రియలను పాక్ సైన్యం పెద్ద ఎత్తున నిర్వహించింది.
షాహునగరి కొల్లాపూర్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కొల్హాపూర్ కుస్తీ, బెల్లం, ఆహార సంస్కృతి, కొల్హాపురి చెప్పులు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. రాజకీయ నాయకుల నుంచి బాలీవుడ్ తారల వరకు అందరూ కొల్హాపురి చెప్పులు వేసుకోవడానికి తహతహలాడుతున్నారు. ఇప్పుడు ఈ కొల్హాపురి చప్పల్ పాకిస్థాన్‌లోనూ క్రేజ్‌గా మారింది. ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా పాకిస్థాన్ నుంచి డిమాండ్ భారీగా పెరిగింది. ఇక్కడి వ్యాపారులు పెద్ద మొత్తంలో చెప్పులను పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నారు.
Pakistan : పాకిస్తాన్‌లో భారతీయ సంస్కృతి జెండాను ఎగురవేసిన సింధ్ నుండి హిందువులు ప్రతేడాది భారతదేశాన్ని సందర్శిస్తారు. వారు షాదానీ దర్బార్ హరిద్వార్ కు వస్తారు.