పాకిస్థాన్ వంచనను మరోసారి యూఎన్ వేదికగా భారత్ ఖండించింది. యూఎన్‌లో భారత దౌత్యవేత్త భావిక మనగలనందన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. పీఓకేలో పాకిస్థాన్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని.. దీన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ద్వంద్వ మాటలు, కపటత్వాన్ని బయటపెట్టారు.