Bangladesh: బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. షేక్ హసీనాను ప్రధాని పదవి నుంచి దించేసిన తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక సర్కార్ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు దగ్గరవుతోంది. తాజాగా, బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి JF-17 థండర్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేస్తుంది.
Pakistan-Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య బలపడుతున్న సంబంధాలు భారత్‌కు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. షేక్ హసీనా గతేడాది పదవీచ్యుతి తర్వాత ఆమె భారత్ పారిపోయి వచ్చారు. మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా మారారు. అప్పటి నుంచి అతను పాకిస్తాన్‌తో సంబంధాలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కొన్ని రోజులుగా పాకిస్తాన్‌కు చెందిన కీలక సైనికాధికారులు, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా, ఐఎస్ఐ అధికారులు భారత సరిహద్దుల్లో పర్యటించడం ప్రమాదకరంగా మారింది.