Bangladesh: బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. షేక్ హసీనాను ప్రధాని పదవి నుంచి దించేసిన తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక సర్కార్ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు దగ్గరవుతోంది. తాజాగా, బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి JF-17 థండర్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ సైన్యం ప్రచార విభాగం అయిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) వెల్లడించింది. బంగ్లాదేశ్‌కు ఫైటర్ జెట్ల అమ్మకం గురించి చర్చించినట్లు పాక్ తెలిపింది. JF-17 ఫైటర్ జెట్లను చైనా, పాకిస్తాన్ కలిసి తయారు చేస్తున్నాయి.
Read Also: Mahindra XUV 3XO EV: మహీంద్రా XUV 3XO EV లాంచ్.. అదిరిపోయే ఫీచర్లు, ఆకర్షణీయమైన ధర..
బంగ్లాదేశ్ ఎయిర్ చీఫ్ మార్షల్ హసన్ మహమూద్ ఖాన్, ఇస్లామాబాద్‌లో పాక్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూతో సమావేశమయ్యారని పాక్ సైన్యం ప్రకటించింది. ఇరు పక్షాల మధ్య ఆపరేషనల్ కోఆపరేషన్, సంస్థాగత సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాయని, శిక్షణ, సామర్థ్య నిర్మాణంపై సహకారాన్ని పెంపొందించుకోవాలని అనుకున్నట్లు చెప్పింది. మరోవైపు, పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ బంగ్లాదేశ్‌కు శిక్షణ ఇవ్వబోతోంది.