Pakistan Army: అన్ని దేశాలకు సైన్యం ఉంటుంది, కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం ఓ సైన్యానికి దేశం ఉందని చెప్పవచ్చు. భారత్ వంటి దేశాల్లో మిలిటరీ చీఫ్‌లుగా పని చేసిన వారు రిటైర్మెంట్ తర్వాత సాధాసీదా జీవితం గడుపుతారు. కానీ పాకిస్తాన్‌లో అలా కాదు మిలిటరీలో చేరితే జాక్‌పాట్ కొట్టినట్లు, ప్రభుత్వమే పదుల నుంచి వందల ఎకరాల భూమిని ఆర్మీలో పనిచేసిన వారికి ఇస్తుంది.