Pak-Afghan war: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రం కాబోతోంది. సోమవారం రాత్రి, ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లోని ఒక రిహాబిటేషన్ ఆస్పత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 400 మంది మరణించారు, 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి పాకిస్తాన్ వైమానిక దళం చేసినట్లు తాలిబన్లు ఆరోపించారు.