Pakistan: పాకిస్తాన్ వరసగా దాడులకు గురవుతోంది. ముఖ్యంగా బెలూచిస్తాన్‌లో ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ పాక్ ఆర్మీపై దాడులు చేస్తోంది. బెలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతోంది. కొన్ని రోజుల క్రితం, క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జఫర్ ఎక్స్‌ప్రెస్‌ని హైజాక్ చేసి, 200 మందికి పైగా పాక్ ఆర్మీ, ఐఎస్ఐ సిబ్బందిని హతం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పాక్ భద్రతా సిబ్బంది కాన్వాయ్ లక్ష్యంగా బీఎల్ఏ విరుచుకుపడింది.