Pakistan: ఉగ్రవాదులకు స్వర్గధామంగా ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న పాకిస్తాన్, ఇప్పుడు ఆ ఉగ్రవాదానికే బలవుతోంది. పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంత కాలంగా ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ముక్యంగా తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ)తో పాటు మరికొన్ని ఉగ్రసంస్థలు అక్కడి పోలీస్ అధికారులను, సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నాయి. టీటీపీకి మంచి పట్టున్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా, వజీరిస్తాన్ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతోంది.
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వానికి పాక్ తాలిబాన్లు సవాల్ విసరుతూనే ఉన్నారు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో సైన్యం, పోలీసులు టార్గెట్ గా దాడులు చేస్తున్నారు.