పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 64 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించడానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.కోటి బడ్జెట్ కేటాయించినట్లు సోమవారం మీడియాకు తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ హిందూ దేవాలయం 1960 నుంచి పని చేయకుండా పోయింది. మొత్తానికి ఇన్నాళ్లకు మోక్షం లభించింది.