India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య ఈ ఏడాది ప్రారంభంలో తలెత్తిన పహల్గాం వివాదం తర్వాత తొలిసారిగా క్రికెట్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మైదానంలోనూ ఘోరంగా అవమానించింది. అయితే, సంప్రదాయానికి భిన్నంగా, మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికీ నిరాకరించారు. ఈ విషయంలో పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ అసంతృప్తి వ్యక్తం చేయగా, తన చర్యను భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సమర్థించుకున్నాడు.