ఈ ఆపరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అమలు చేశాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. మన పౌరులను బలి తీసుకున్న టెర్రరిస్టులను అంతం చేయాలని త్రివిధ దళాలు కోరగానే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పుకొచ్చారు.