ఆమెకు చెట్లు పెంచడం మాత్రమే తెలుసు.. ప్రకృతితో మమేకం కావడమే ఆమె జీవితం.. అందుకే ఈ దేశం ఆమెను “వృక్షమాత” అని కీర్తిస్తుంది. ఆమే సాలుమారద తిమ్మక్క. 111 యేండ్లు వచ్చినా.. చక్కగా నుడుస్తూ వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆశీర్వదించి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అంతేకాదు, 2016లో బీబీసీ ఛానెల్ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో తిమ్మక్క స్థానం దక్కించుకున్నారు. అంతటి మహానుభావురాలు రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్…