CM Revanth Reddy: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో పంటలకు భారీ నష్టం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించిన సుమారు 5,528 ఎకరాల పంటలు వర్షాల కారణంగా నష్టపోయాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రూ.51.528 కోట్ల…