El Nino:వాతావరణ నిపుణులు అంచనా వేసినట్లుగానే పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ఏర్పడింది. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావం వల్ల అనేక దేశాల్లో ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.