దాయాది దేశం పాకిస్థాన్‌పై అంతర్జాతీయ వేదికగా భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని.. సొంత ప్రజలనే బాంబులతో చంపేస్తోందని భారత్ విమర్శించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి ప్రసగించారు.