'ఆపరేషన్ సిందూర్'పై బాలీవుడ్ సినిమా రాబోతోంది.. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన శక్తివంతమైన ప్రతీకార చర్య అయిన 'ఆపరేషన్ సిందూర్' ఆధారంగా ఈ బాలీవుడ్ చిత్రం రాబోతోంది. 'ఆపరేషన్ సిందూర్' పేరుతోనే అధికారికంగా ఈ సినిమాను ప్రకటించారు.. అంతేకాదు.. ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను.. అంటే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు.