టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చూపించలేకపోతున్నారు. అయినప్పటికీ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఓపెనింగ్ జోడీని భారత్ కొనసాగించాలని లెజెండరీ వెస్టిండీస్ క్రికెటర్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్‌కే (1, 4, 0) పరిమితమయ్యాడు. మరోవైపు.. రోహిత్ ఐర్లాండ్‌పై హాఫ్ సెంచరీతో రాణించాడు.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లలో 13, 3 పరుగులకే ఔటయ్యాడు. అయితే.. వీరిద్దరూ తక్కువ స్కోర్లు చేసినప్పటికీ..…