బహిరంగ ప్రదేశాలలో నమాజ్ అంశం కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ప్లేస్‌లో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను సహించేది లేదన్న హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటన వివాదాస్పదమైంది. గురుగ్రామ్‌లో ముస్లింలకు గతంలో కేటాయించిన ప్రార్థనా ప్రదేశాలన్నిటిని హర్యానా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. నిర్దేశిత ప్రదేశాలలో ముస్లింలు ప్రార్థనలు చేయటాన్ని ఆర్‌ఎస్‌ఎస్ సహ హిందూ సంస్థల కార్యకర్తలు అడ్డుకోవటం ఈ నిర్ణయానికి దారితీసింది. ఐతే, ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఖట్టర్ నిర్ణయంపై…