PhonePe Wonderful Decision: ఈ రోజుల్లో ఫోన్ గురించి తెలియనివారు ఉన్నారా? అస్సలు లేరు కదా!. అలాగే.. ఫోన్‌పే గురించి తెలియనివారు కూడా లేరంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే అది అంతగా ప్రజల్లోకి వెళ్లింది. మనం రోజూ పలికే ఫోన్ అనే రెండక్షరాల పక్కన ‘పే’ అనే ఒక్క అక్షరం చేర్చటంతో ఆ పేరు పలకటం ప్రజలకు ఈజీ అయింది. అలా.. అది జనం నోళ్లల్లో నానింది. మౌత్ పబ్లిసిటీతోనే ప్రతి సిటీ నుంచి గల్లీగల్లీకీ చేరింది.