Jaish-e-Mohammed: ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తిన్నా కూడా పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు బుద్ధి రావడం లేదు. ఉగ్రవాదం కోసం ఇప్పుడు మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. జైషే చీఫ్ మసూద్ అజార్ 21 నిమిషాల ఆడియోలో ఉగ్రవాదులుగా మహిళల్ని నియమించడం, శిక్షణ ఇవ్వడం గురించి ఉంది. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రసంస్థ భారత వ్యతిరేక ప్రచారంతో బ్రెయిన్ వాష్ చేస్తోంది.