ఈ కరోనా పాడుగానూ.. ఎప్పుడొచ్చిందో.. ఎలా వచ్చిందో కానీ.. అందరికంటే ఎక్కువగా విద్యార్థులకే నరకం చూపిస్తోంది. కరోనా లాక్ డౌన్ మొదలైంది మొదలు అన్నీ బంద్ పడ్డాయి. అయితే అన్నీ పట్టాలెక్కినా కూడా ఇంకా మొదలు కానిది ఏమన్నా ఉందా? అంటే అవి చదువులే.. ఏడాదిన్నరగా విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరంగా ఆన్ లైన్ క్లాసుల వెంటపడ్డారు. కండ్లు కాయలు కాసేలా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ ల ముందు గంటల తరబడి కూర్చుంటున్న పరిస్థితులున్నాయి. ప్రస్తుతం పెద్ద…