ఉల్లి ఘాటు విమానాన్ని వెనక్కి రప్పించింది. సాధారణంగా సాంకేతిక సమస్యలు, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు విమానాలు దారి మళ్లించడం లేదా దగ్గర్లోని ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేస్తుంటారు.
If You Eating Raw Onion Heavily Will Face Acidity, Constipation and Intestine Problems: భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ‘ఉల్లిపాయ’ను అందరూ ఇష్టపడుతారు. సాత్విక ఆహారాన్ని తీసుకునే కొంతమంది మాత్రమే ఉల్లిపాయలను ముట్టుకోరు. భారతీయ వంటకాల్లో ఉల్లి లేని కూర దాదాపుగా ఉండదు. నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరు నిమ్మకాయ పిండుకుని మరీ ఉల్లిని ఇష్టంగా తింటుంటారు. చాలా హోటళ్లలో సలాడ్లుగా కూడా వీటిని పెడుతారు. ఆరోగ్యానికి ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది.…
టొమాటో తర్వాత ఇప్పుడు ఉల్లి కూడా కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. గత 4 రోజుల్లో ఉల్లి ధర కూడా బంపర్ జంప్ నమోదైంది. కిలో రూ.15 పలికిన ఉల్లి ధర.. ఇప్పుడు రూ.20 నుంచి 25కి చేరింది. ఈ విధంగా గత 4 రోజుల్లో ఉల్లి ధర కూడా రూ.10 పెరిగింది. ఉల్లిపాయల హోల్‌సేల్ ధర గురించి మాట్లాడితే.. 25 శాతం పెరిగింది.
Onion Farmers Tears: ఊహించని విధంగా ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. కొందరు ధర గిట్టుబాటు కావటం లేదని దేవరకద్ర మార్కె ట్లో విక్రయానికి తెచ్చిన ఉల్లిని, అదే వాహనంలో తిరిగి ఇంటికి తీసుకెళ్ళిన దుస్థితి. మార్కెట్లోకి వివిధ ప్రాంతాల నుంచి కొత్త ఉల్లి ఒక్క సారిగా వచ్చిపడింది. 2 వేల వరకు ఉండే క్వింటాల్ ఉల్లి ధర ఒక్కసారిగా 600 నుంచి 1000 రూపాయలకు పడి పోయింది. మార్కెట్ కమిటి…
ప్రస్తుతం నిమ్మకాయ రేటు ఆకాశాన్ని అంటుతోంది. కేజీ నిమ్మకాయల ధర రూ.200పైగా పలుకుతోంది. దీంతో పలువురు వంటల్లో నిమ్మకాయ పులుపు చాలావరకు తగ్గించేశారు. చాలా చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లలో ఉల్లిపాయతో పాటు నిమ్మకాయ ఇవ్వడం మానేశారు. అదేదో సినిమాలో వరంగల్‌లో నిమ్మకాయను ఏమంటారంటే నిమ్మకాయనే అంటారనే కామెడీ డైలాగ్ తరహాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఉల్లిపాయని నిమ్మకాయ అనాల్సి వస్తోంది. అదేంటి నిమ్మకాయను ఉల్లిపాయ అనడమేంటని అనుకుంటున్నారా? దీని కథేంటో పూర్తిగా తెలుసుకుందాం…
దేశంలో మళ్లీ ఉల్లి ధరలు పెరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. మనదేశంలో అత్యధికంగా ఉల్లి పంట మహారాష్ట్రలో పండుతుంది. అయితే, తుఫాన్, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ఉల్లిపంట దెబ్బతిన్నది. దీంతో డిమాండ్‌కు తగినంత ఉల్లిపంట లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. ఉల్లి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎంతమేర ఉల్లి ధరలు పెరుగుతాయి, ఎన్ని రోజులకు తిరిగి కొత్త పంట అందుబాటులోకి వస్తుంది అన్నది…
ఉల్లి పంట ఎక్కువగా పండే జిల్లాల్లో కర్నూలు ఒకటి. కర్నూలు జిల్లాలో రైతులు ఎక్కువగా ఉల్లిని పండిస్తుంటారు. ఉల్లి పంటకు ఎప్పుడు గిరాకి వస్తుందే ఎప్పడు నేల చూపులు చూస్తుందో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే, జిల్లాలోని ఉల్లి రైతులు రోడ్డెక్కారు. గత 10 రోజులుగా ఉల్లిని కొనుగోలు చేయడం వ్యాపారులు నిలిపివేయడంతో రైతులు ఆందోళనల చేస్తున్నారు. ఈనాం పద్దతిలో ఉల్లిని కోనుగోలు చేయాలని అధికారులు చెబుతుండగా, తాము ఈనాం పద్దతిలో ఉల్లిని కొనుగోలు చేయలేమని చెప్పి…