ఒంగోలులో ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్‌పై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. సీఎం కాన్వాయ్ కోసమంటూ తిరుమల వెళ్తున్న ఓ కుటుంబాన్ని ఆపి వాహనాన్ని తీసుకెళ్లిన ఉదంతంపై చర్యలు చేపట్టారు. వాహనాలను ఆపిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి వినుకొండ నుంచి తిరుమల వెళ్తున్న ఓ కుటుంబం టిఫిన్ కోసం ఒంగోలులో ఆగింది. అక్కడికి వచ్చిన ఓ కానిస్టేబుల్ సీఎం జగన్ పర్యటనకు కాన్వాయ్ కావాలంటూ వాహనాన్ని,…