టీడీపీ నేతలకు ఎవరి పార్టీ ఆఫీసు వాళ్లదే నూకసాని బాలాజీ. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు. గతంలో వైసీపీలో ఉన్న ఆయన తర్వాత పసుపు కండువా కప్పుకొన్నారు. వైసీపీలోనూ ఆయనకు జిల్లా అధ్యక్షుడి హోదా కట్టబెట్టారు. జడ్పీ చైర్మన్ అభ్యర్దిగా ప్రకటించినా.. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో అది సాధ్యం కాక మరొకరు ఆ పోస్టును తన్నుకు పోయారు. చేసేదేమీ లేక టీడీపీలో చేరిపోయారు నూకసాని. అప్పటి నుంచి టీడీపీలో ఆయనకు సముచిత స్ధానమే దక్కింది. కొంతకాలానికి…