ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 3 నుంచి 4 వరకు బ్రూనైలో పర్యటించనున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పర్యటన బ్రూనైతో ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
బ్రూనైకి చెందిన సుల్తాన్ హసనల్ బోల్కియా ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరు. సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభమయ్యే బ్రూనై పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి బోల్కియా ఆతిథ్యం ఇవ్వనున్నారు.