‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ పదవీకాలాన్ని 2025 వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు వరకు పొడిగించే ప్రతిపాదనను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు 2024 మరియు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు- 2024 పై లోక్‌సభలో నివేదిక సమర్పించడానికి సమయాన్ని పొడిగించాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) చైర్మన్ పిపి చౌదరి మంగళవారం ప్రతిపాదించారు. దీనిని సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. Also Read:Volkswagen:…