ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా కొనసాగుతుంది. తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ 51 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి తొలి స్థానానికి చేరుకోగా.. బ్యాటింగ్ విభాగంలో యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌కు చేరువయ్యాడు.