ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ప్రారంభించింది. పబ్లిక్ ప్లేసెస్ లో మాస్కును తప్పనిసరి చేసింది. మాస్కులేకపోతే ఐదొందల రూపాయల జరిమానా తప్పదని హెచ్చరించింది. కార్లలో ప్రయాణించే వారికి మాస్కు నుంచి మినహాయింపు ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. అలాగే స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది ప్రతి ఒక్కర్నీ థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే, అనుమతించాలని తెలిపింది. పాజిటివ్ అని తేలిన పిల్లలను పాఠశాలకు పంపొద్దని తల్లిదండ్రులను కోరింది. ఢిల్లీలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 967…
తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం పునరుద్దరించలేదని టీటీడీ తెలిపింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేశారు టీటీడీ అధికారులు. ఇప్పటికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించినట్టు అవాస్తవ సమాచారం…