క్రిస్మస్ సందర్భంగా భవిష్ అగర్వాల్‌కు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ దేశవ్యాప్తంగా 3200 కొత్త స్టోర్లను ప్రారంభించింది. దీంతో కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 4000కు చేరింది. ఓలా భారతదేశపు అతిపెద్ద ఈవీ పంపిణీదారు కంపెనీగా అవతరించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ ద్వారా తెలిపారు.
Ola Scooters: ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం పెరుగుతుండటంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండియాలోనూ ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2022 ఏడాదిని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఘనంగా ముగించింది. డిసెంబర్ నెలలో మొత్తంగా 25 వేలకు పైగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడుపోయాయి. దీంతో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‍లో ఓలా 30 శాతం వాటాను దక్కించుకుంది. ఒకే నెలలో 25వేల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు…