నిత్యావసర వస్తువైన వంట నూనె వినియోగం పెరుగుతోంది. డిమాండ్ కు తగిన ఉత్పత్తి లేకపోవడంతో భారత్ వంట నూనెను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి, భారత్ 2024-25 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్ వరకు) 16 మిలియన్ టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకుంది. మొత్తం ఖర్చు రూ. 1.61 లక్షల కోట్లు అని పరిశ్రమ సంస్థ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) గురువారం విడుదల చేసిన డేటా వెల్లడించింది. Also…