OIC Kashmir Meeting: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో కాశ్మీర్‌పై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) కాంటాక్ట్ గ్రూప్ సమావేశమైంది. ఈ సమావేశంలో అజర్‌బైజాన్, పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా, నైజర్ దేశాల విదేశాంగ మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి OIC సెక్రటరీ జనరల్ హిస్సేన్ బ్రహ్మిమ్ తహా అధ్యక్షత వహించారు. ఇందులో కాశ్మీరీ ప్రతినిధి బృందం కూడా పాల్గొన్నారు. భారత్‌లోని జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయ, భద్రతా పరిస్థితిని వారి…