పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. తాజాగా అయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవల కడప పర్యటనకు వెళ్లిన సమయంలో మీడియాతో మాట్లాడుతుండగా అభిమానులు ఓజీ.. ఓజీ.. ఓజీ.. సీఎం.. సీఎం అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అసహనానికి గురైన పవన్ కళ్యాణ్.. అభిమానులను ఉద్దేశించి.. మీకు ఎక్కడ ఏం స్లోగన్ ఇవ్వాలో…
ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా.. ఆయన అభిమానులు OG..OG అంటూ కేకలు వేశారు. దీంతో పవన్ మాట్లాడుతూ.. సినిమా పేర్లు జపించడం కంటే భగవన్నామస్మరణ చేస్తే బాగుంటుందని అభిమానులకు సూచించారు. సినిమాలు ఒక సరదా మాత్రమే.. సినిమాలు ఉండాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.