రేపు(ఆదివారం)మధ్యాహ్నం డీఎస్ స్వంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. డి. శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. డీఎస్కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.