గత కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఎక్కువయ్యాయి. తీవ్ర ఒత్తిళ్లతో కూడిన జీవన శైలి, జంక్ ఫుడ్, సరిగా నీళ్లు తాగకపోవడం, డయాబెటిస్, ఆల్కహాల్ అలవాటు వంటివి దీనికి కారణం అవుతున్నాయి. తమకు కిడ్నీ సమస్యలు తీవ్రమయ్యాయని చాలా మంది గుర్తించలేకపోతున్నారు. ఈ క్రమంలో చేసేదేమీ లేక ఇబ్బందులుపడుతూనే ఉన్నారు. ముందే లక్షణాలను గుర్తించగలిగితే.. త్వరగా చికిత్స తీసుకుని, సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.