తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో....బీసీ రిజర్వేషన్ల అంశం మీద జోరుగా చర్చ జరుగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలన్న విషయంలో అన్ని పార్టీలది ఒకటే మాట. కానీ... సాధనలో మాత్రం ఎవరి రాజకీయాలు వారివి అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది.
ఆ నియోజకవర్గంలో గులాబీ కేడర్ బలంగానే ఉన్నా…. నడిపే నాయకుడు మాత్రం లేకుండా పోయారా? నాయకత్వం ఇస్తే తీసుకోవడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నా… పార్టీ అధిష్టానం మీన మేషాలు లెక్కిస్తోందా? సందట్లో సడేమియా అంటూ… కింది స్థాయి బీఆర్ఎస్ లీడర్స్ మీదికి కాంగ్రెస్ వల విసురుతోందా? ఎక్కడుందా పరిస్థితి? ఎందుకలా? ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ కారు నడిపే డ్రైవర్ కరవయ్యారట. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో…లోకల్‌గా పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా…
కోటగిరి శ్రీధర్... వారసత్వంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ నాయకుడు 2019లో ఫస్ట్ టైం వైసీపీ తరపున ఏలూరు ఎంపీ అయ్యారు. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయనే స్వచ్చందంగా బరి నుంచి తప్పుకున్నారు. ఎందుకలా.... అంటే, అమెరికాలో ఉన్న కుటుంబానికి దూరంగా ఉండలేకపోతున్నానన్నది ఆయన సమాధానం.
తెలుగుదేశం పార్టీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్ఛాపురం. ఇక్కడి నుంచి ఆ పార్టీ తరపున హ్యాట్రిక్ కొట్టారు ఎమ్మెల్యే బెందాళం అశోక్. ప్రస్తుతం ప్రభుత్వ విప్ పదవిలో కూడా ఉన్నారాయన. అయితే... ఇన్నేళ్ళ సంగతి ఎలా ఉన్నా... ఇప్పుడు మాత్రం ద్వితీయ శ్రేణి నాయకులే ఆయన మీద గుర్రుగా ఉన్నారట. అదే సమయంలో ఇన్నిసార్లు గెలిపిస్తే.. నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారు సార్.. అన్న ప్రశ్నలు సైతం ప్రజల నుంచి మొదలవుతున్నాయి.
వైసీపీ మాజీ మంత్రి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే... గుమ్మనూరు జయరాం, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటోంది. పార్టీలు మారినా... వాళ్ళ వివాదాస్పద తీరు మాత్రం మారదా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. నిత్య వివాదం లేకుంటే వీళ్ళకు నిద్ర పట్టదా అని కూడా మాట్లాడుకుంటున్నారట.
తెలంగాణలో ఇప్పుడు టచ్ పాలిటిక్స్ జోరు పెరిగిపోయిందా? కొందరు నాయకులకు గులాబీ రంగు మీద మొహం మొత్తి కాషాయంపై మనసు పారేసుకుంటున్నారా? అట్నుంచి కూడా కొంచెం టచ్‌లో ఉంటే… చెబుతామన్న సమాధానం వస్తోందా? తెలంగాణలో బీజేపీ కొత్త గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? కాషాయ కండువా కప్పుకోవాలని తహతహలాడుతున్న నాయకులెవరు? ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో ఎప్పటికప్పుడు ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ రాజకీయాల్లో మరికొన్ని కీలక మార్పులు జరగబోతున్నాయన్న ప్రచారం జోరందుకుంది. శరవేగంగా మారుతున్న పరిణామాలు కూడా అదే…
తెలంగాణలోని ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నారా? తన కళ్ళెదుటే తన్నుకోబోయిన పార్టీ నేతల్ని ఆమె ఎలా సెట్ చేస్తారు? ఏం చెప్పి వాళ్ళని మారుస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో ఈ తన్నులాటలు పార్టీ పుట్టి ముంచుతాయా? అలా జరక్కుండా తేల్చడానికి మంత్రి దగ్గరున్న మంత్ర దండం ఏంటి? అంత దారుణమైన పరిస్థితులున్న ఆ జిల్లా ఏది? సవాల్ ఎదుర్కొంటున్న ఆ మంత్రి ఎవరు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇటీవలే…
తెలుగుదేశం పార్టీ కంచుకోట గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ వరుసగా మూడు విడతల నుంచి టీడీపీ అభ్యర్ధులే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. క్యాండిడేట్ ఎవరన్న దానితో సంబంధం లేదు. జస్ట్ గుంటూరు వెస్ట్ టీడీపీ టిక్కెట్ తెచ్చుకోగలిగితే చాలు.... ఎమ్మెల్యే అయిపోయినట్టే. దానికి చెక్ పెట్టేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసినా... వర్కౌట్ కాలేదు. 2024లో పార్టీ తరపున బలమైన అభ్యర్థిగా భావిస్తూ... మాజీ మంత్రి విడదల రజనీని గుంటూరు వెస్ట్ బరిలో దింపింది వైసీపీ.