Home
Off The Record
Off The Record News
-
Off The Record : నర్సాపురం పొలిటికల్ లేబొరేటరీస్‌లో వైసీపీ ప్రయోగాలు వికటించాయా..?
నర్సాపురం పొలిటికల్ లేబొరేటరీస్‌లో వైసీపీ ప్రయోగాలు వికటించాయా? ఎవ్వరూ చేయని, కనీసం ఆలోచన కూడా రాని ఎక్స్‌పెరిమెంట్‌కు మేం శ్రీకారం చుట్టామని నాడు గొప్పలు చెప్పుకున్న పార్టీకి నేడు అక్కడ దిక్కు లేకుండా పోయిందా? రండి బాబూ… రండి… పదవి తీసుకోండని పిలుస్తున్నా… అటువైపు చూసేవాళ్ళే కరవయ్యారా? మీ పదవి మాకొద్దు బాబోయ్ అని పార్టీ సీనియర్సే దండం పెట్టడానికి కారణం ఏంటి? అసలేంటా పదవి? నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం….. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా… -
Off The Record: అచ్చంపేటకు ముఖం చాటేసిన గువ్వల బాలరాజు
పార్టీ పవర్లో ఉండి, తాను పదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా హోదా వెలగబెట్టినప్పుడు కన్ను మిన్ను కానరాలేదట ఈ లీడర్‌కి. నియోజకవర్గంలో బిల్డప్ బాబాయ్ మాటలు చాలానే చెప్పారట. ఏ విషయం మాట్లాడినా... ఓస్ అంతేనా అంటూ... అసలు బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత నేనే అన్నంతగా గొప్పలకు పోయారట. తీరా ఎంపీ టిక్కెట్ అడిగినా ఇవ్వకపోయేసరికి సిగ్గుబోయి నియోజకవర్గానికి ముఖం చాటేసిన ఆ నాయకుడు ఎవరు? ఏంటాయన ఎకసెక్కాల యవ్వారం? -
Off The Record: జనసేన వైపు రాపాక వరప్రసాద్ అడుగులు..?
వైసీపీలో ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే తిరిగి సొంత గూటికి చేరబోతున్నారా? వెళ్ళాలి... వెళ్ళిపోవాలంటూ... మనసు తెగ లాగేస్తోందా? ఎప్పుడెప్పుడు గ్లాస్ పట్టుకుందామా అని ఆయన ఆత్రంగా ఎదురు చూస్తున్నా... గతం వెంటాడుతోందా? నాయకత్వం సంగతి తర్వాత ముందు జనసైనికులే అడ్డుకుంటారన్న భయం ఉందా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటాయన మనసు లాగుడు మేటర్? -
Off The Record: కొండా, రేవూరి వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్
ఓరుగల్లు కాంగ్రెస్ పోరుకు కేరాఫ్ అవుతోందా? మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా మొదలైన వ్యవహారం మొత్తం పార్టీకే చుట్టుకుంటోందా? ఏకంగా అధికార పార్టీ కేడరే పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడాన్ని ఎలా చూడాలి? మంత్రి కొండా సురేఖ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి కొత్త వివాదానికి తెర తీశారా? ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? -
Off The Record : పడమరలో వైసీపీ సైడ్ ట్రాక్..కేడర్ ఉక్కిరిబిక్కిరి
2019 ఎన్నికల్లో పడమరలో ఫ్యాన్ ఫుల్ స్పీడులో తిరిగింది! ఇప్పుడు ఒకటో నంబర్లో పెట్టినట్టుగా ఉంది! రెక్కలుగా ఉన్నవాళ్లంతా సైడయ్యారు! గాలిరాక కేడర్ ఉక్కిరిబిక్కిరవుతోంది! గ్రంధి రందితో పక్క చూపులు చూస్తున్నారని నియోజకవర్గంలో టాక్. ఆచంట లీడర్ ఏచెంత ఉన్నారో తెలియక అయోమయం! ఆళ్ల కాళీ కృష్ణ వెళ్లిపోయాక ఆ ప్లేస్ ఇంకా ఖాళీగానే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో నరసాపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు చాలా కీలకమైనవి. ఇక్కడి ఓటర్లు ఎప్పుడూ వన్ సైడ్‌గా గెలుపును… -
Off The Record : శింగనమల, మడకశిరలో తప్పిన వైసీపీ లెక్క..మళ్లీ జనానికి కనిపించని అభ్యర్థులు
కులబలం, ధనబలం, పొలిటికల్ ట్రాక్ రికార్డు.. ఈ లెక్కలన్నీ వేసినా.. ఓ పాతిక ముప్పయ్ కోట్లు చేతిలో ఉండాల్సిందే! ఆ మాత్రం బరువు లేనిదే ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వదు! ఈ సంగతి అందరికీ తెలుసు. అలాంటి సినారియోలో ఓ ఇద్దరికి సామాన్యులకు టికెట్స్ ఇచ్చారా అధినేత. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఇద్దరూ ఓడిపోయారు! తర్వాత మాయమయ్యారు! ప్రయోగం వికటించినా ఇంతవరకు విరుగుడు మంత్రమేంటో అధినేత చెప్పడం లేదట. Off The Record… -
Off The Record : ఆదోని వైసీపీలో అయోమయం..కేడర్ జారిపోతున్నా పట్టించుకోని సాయిప్రసాద్ రెడ్డి
ఆ నియోజకవర్గంలో దశాబ్దాలుగా టీడీపీకి ప్రత్యామ్నాయం ఆ నాయకుడే. కాంగ్రెస్ నుంచి ఒకసారి, వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచారు. ఇప్పుడు లెక్క తప్పింది! అనుచరగణమంతా గుడ్ బై చెప్పి పోతున్నారు. ఎందుకలా అంటే సౌండ్ లేదు! కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం. నియోజకవర్గంలో 1994 నుంచి ఇద్దరు నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. మూడు దశాబ్దాలుగా ఇద్దరిదే హవా అక్కడ. అయితే మీనాక్షి నాయుడు. లేదంటే వై. సాయిప్రసాదరెడ్డి. 2004 వరకు కాంగ్రెస్‌లో ఉన్న సాయిప్రసాదరెడ్డి… -
Off The Record : టార్గెట్ కాంగ్రెస్..దసరా తర్వాత బీఆర్ఎస్ లో పదవుల పందేరం
అధికారంలో ఉన్నప్పుడు ఆ అవసరం రాలేదు. ప్రతిపక్షంలోకి వచ్చాక అక్కెరకొచ్చింది. అందుకే సెట్ చేసే పనిలో పడ్డారు. రండి బాబూ రండి.. కార్యకర్తలను ఉత్తేజపరిచే పనిలో పడ్డారట. దసరా తర్వాత గులాబీశిబిరంలో పందేరమే అంటున్నారు. డిసెంబర్లో గులాబీ బాస్ ఫాంహౌజ్ వీడుతారని చెబుతున్నారు! కాంగ్రెస్ ప్రభుత్వానికి యేడాది టైం ఇచ్చిన తర్వాత ఎటాక్ చేద్దామనే వ్యూహంలో బీఆర్ఎస్ ఉందట! ఆ క్రమంలోనే పార్టీ రూట్ లెవల్లో సెట్ చేద్దామనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడాని ఎదురు… -
Off The Record: తుంగతుర్తి కాంగ్రెస్‌లో లుకలుకలు.. కేడర్‌కు చుక్కలు చూపిస్తున్న ఎమ్మెల్యే మందుల సామేలు
కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆ నియోజకవర్గం కేరాఫ్‌గా మారింది! దగ్గరుండి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తగినశాస్తే జరిగిందని ఒక బ్యాచ్ ఆవేదన వ్యక్తం చేస్తోంది! వలస వచ్చిన వారికే ప్రియారిటీ ఇస్తున్నారని.. పాత వాళ్లను పాతరేశారని భగ్గున మండుతున్నారు. ఇంతకూ కొత్త, పాత నేతలుగా వారంతా ఎందుకు విడిపోయారు? సీనియర్లను పక్కన పడేసిన ఆ ఎమ్మెల్యే ఎవరు? -
Off The Record: కొవ్వూరులో పేకాట క్లబ్బులపై పోలీస్ వార్ డిక్లేర్..కారణం ఏంటి ?
మేం ఆడుతాం అని వీళ్లు! మిమ్మల్ని ఆడనివ్వం వాళ్లు! పర్మిషన్ ఉందని వీళ్లు! అయినా సరే ఆటలు సాగనివ్వం అని వాళ్లు! అధికారపార్టీనే అడ్డుకుంటారా అని వాళ్లు! ఎవరైతే నాకేంటి అని వీళ్లు! ఇదీ అక్కడి క్లబ్బుల్లో జరుగుతున్న వార్! ఇంకా క్లారిటీ కావాలంటే.. ఛలో కొవ్వూరు!
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!