Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటేసింది. ఇవాళ (సోమవారం) ఉదయం 11.30 గంటలకు ఒడిశా రాష్ట్రం పూరీ సమీపంలోని గోపాల్‌పుర్ దగ్గర తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, కాసేపట్లో పూరీ దగ్గర తీరం దాటనుంది తీవ్ర వాయుగుండం.. భూ ఉపరితలంపై ఇవాళ అర్ధరాత్రి వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ క్రమేపీ బలహీనపడుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది..
Spy Pigeon: ఒడిశాలోని పారాదీప్ తీరంలో ఓ అనుమానిత గూఢచార పావురం కలకలం సృష్టిస్తోంది. జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో ఓ పావురానికి కెమెరా, మైక్రోచిప్ అమర్చి ఉండటాన్ని అక్కడి స్థానికులు గమనించారు. దీన్ని ఓ చేపలు పట్టే పడవలో పట్టుబడింది. ఈ పావురాన్ని గూఢచర్యానికి ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం కొందరు మత్స్యకారులు తమ పడవపై పావురం ఉన్నట్లు గుర్తించారు. బుధవారం పారాదీప్‌లో పక్షిని పట్టుకుని మెరైన్ పోలీసులకు అప్పగించారు.
క్షిపణి ప్రయోగాల్లో భారత్ దూకుడును ప్రదర్శిస్తోంది. తాజాగా అగ్ని ప్రైమ్ న్యూ జనరేషన్ బాలిస్టిక్ క్షిపణిని భారత్ ఇవాళ 09.45గంటలకు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఆ పరీక్షను చేపట్టారు.