Naveen Patnayak : ఒడిశాలో ఎప్పుడూ పట్నాయక్‌లదే ఆధిపత్యం. పట్నాయక్ రాజకీయాల్లోనే కాకుండా ఆర్థిక రంగంలో కూడా ముందున్నారు. 77 ఏళ్ల స్వాతంత్య్రానంతర చరిత్రలో ముగ్గురు పట్నాయక్‌లు ఒడిశాలో మొత్తం 45 ఏళ్లపాటు అధికారంలో ఉన్నారు.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నాలుగు దశల్లో జరగనుండగా, మే 13 (సోమవారం), మే 20 (సోమవారం), మే 25 (శనివారం), జూన్ 1 (శనివారం) తేదీల్లో పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు ప్రకటించింది.