టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-నేపాల్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ అభిమానులకు గంభీర్ మిడిల్ ఫింగర్ ను చూపించాడు.