దేశంలో ఎక్కడ న్యాయం జరగకపోయినా.. కోర్టుకెళ్తే కచ్చితంగా న్యాయం దక్కుతుందని మొన్నటివరకూ సామాన్యులకు ఆశలుండేవి. అలాగే జడ్జిలు నిజాయితీగా ఉంటారని, నిష్పాక్షికంగా తీర్పులిస్తారనే నమ్మకం ఉండేది. కానీ ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ ఇంట్లో కట్టలు కొద్ది క్యాష్ దొరకడం దేశంలోనే సంచలనం సృష్టించింది.