మేషం : ఈ రోజు ఈ రాశిలోని మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. భాగస్వామికంగా కంటె సొంత వ్యాపారాలే మీకు అనుకూలిస్తాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆకస్మిక ఖర్చులు, ధనం సమయానికి అందకపోవటం వంటి చికాకులు ఎదుర్కుంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారు కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు దూర ప్రదేశాల్లో కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. బంధువుల…